« కుమ్మరి ఓ కుమ్మరి (E)

పల్లవి:
కుమ్మరి ఓ కుమ్మరి - జగదుత్పత్తిధారి    
జిగటమన్నైన నా వంక - చల్లగ చూడుమయ్యా    
1.
పనికి రాని పాత్రయని - పారవేయకుమా    
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా     (2X)
...కుమ్మరి...
2.
యోగ్యమైన పాత్రగా - పావన పరచుమా    
ఘనతయైన పాత్రగా - మార్చివేయుమా     (2X)
...కుమ్మరి...
3.
లేఖన మందలి పాత్రలు - యేసుని స్తుతియించెగా    
నన్నును అట్టి పాత్రగా - మార్చివేయుమా     (2X)
...కుమ్మరి...