« దేవా మా కుటుంబము నీ సేవకే
Dheva maa kutumbamu
share with whatsapp

పల్లవి:
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము   
ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ   
నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా   
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము    (2X)
1.
కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు   
మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య   
లోబడి జీవింతుము లోపంబులు సవరించుము   
లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము   
2.
సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము    
నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య   
ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము    
ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము   
3.
ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను    
లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో   
వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి    
ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్   
4.
పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్    
నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము   
వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము    
కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము