« దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది
Dhevuniki sthothramu ganamu
share with whatsapp

పల్లవి:
దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది   
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది   
1.
యేరుషలేము నెహోవాయె - కట్టుచున్నవాడని    (2X)
ఇశ్రయేలీయూలను - పోగు చేయువాడని   
...దేవునికి...
2.
గుండె చెదరిన వారిని - బాగుచేయువాడని    (2X)
వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని   
...దేవునికి...
3.
ప్రభువు గొప్పవాడును - అధిక శక్తి సంపన్నుడు    (2X)
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని   
...దేవునికి...
4.
పిల్లలా నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్    (2X)
మంచి గోదుమపంటతో - నిన్ను తృప్తిగనుంచును   
...దేవునికి...
5.
వాక్యమును యాకోబుకు - తెలియజేసినవాడని    (2X)
ఏ జనము కీలాగునా - చేసి యుండలేదని   
...దేవునికి...