పల్లవి: |
యేసుతో ఠీవిగాను - అడ్డుగా వచ్చువైరి గెల్వను |
యుద్ధ నాదంబుతో బోదము |
...యేసుతో... |
1. |
రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్యసేవ చేయను (2X) |
యేసు రాజు ముందుగా - ధ్వజము బట్టి నడువగా (2X) |
యేసుతో ఠీవిగాను వెడలను |
...యేసుతో... |
2. |
విశ్వాస కవచమున్ ధరించుచు - ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2X) |
అనుదినంబు శక్తిని - బొందుచున్న వారమై (2X) |
యేసుతో ఠీవిగాను వెడలను |
...యేసుతో... |
3. |
శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా (2X) |
భయములేదు మనకిక - ప్రభువు చెంత నుందుము (2X) |
యేసుతో ఠీవిగాను వెడలను |
...యేసుతో... |
4. |
ఓ యువతి యువకులార చేరుడీ - శ్రీ యేసురాజు వార్త చాటుడి (2X) |
లోకమంత ఏకమై - యేసునాధు గెల్వను (2X) |
సాధనంబేవరు నీవు నేనెగా |
...యేసుతో... |