పల్లవి: |
యేసుని కొరకై యిల జీవించెద-భాసురముగ నే ననుదినము (2X) |
దోశములన్నీ బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా |
...యేసుని... |
1. |
నాశనకరమగు గుంటలొనుండియు మోసకరంబగు యూబినుండి (2X) |
నాశచె నిలపై కెత్తెను నన్ను పిశాచి పధంబున దొలగించెన్ |
...యేసుని... |
2. |
పలువిధముల పాపంబును జేసతి వలదని ద్రోసితి వాక్యమును (2X) |
కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలొ నన్నాకర్షించెన్ |
...యేసుని... |
3. |
అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్ (2X) |
కలిగెను నెమ్మది కలువరిగిరిలొ విలువగు రక్తము చిందించిన ప్రభు |
...యేసుని... |
4. |
శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొను నా ప్రభువనిశం (2X) |
వ్యాధులు లేములు మరణము వచ్చిన నాధుడె నా నిరీక్షణగున్ |
...యేసుని... |
5. |
బుద్ధి విజ్ఙాన సర్వసంపదలు గుప్తమై యున్నవి ప్రభునందు (2X) |
అద్భుతముగ ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని |
...యేసుని... |
6. |
అర్పించెను దన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు (2X) |
అర్పింతును నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప |
...యేసుని... |
7. |
ప్రభునందానందింతును నిరతము ప్రార్ధన విజ్ఙాపనములతో (2X) |
విభుడే దీర్చును యిలనా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్ |
...యేసుని... |
8. |
యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి (2X) |
పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురించన్ |
...యేసుని... |