పల్లవి: |
యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము |
అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము (2X) |
...యేసు... |
1. |
ప్రతి ఘోర పాపము కడుగును - మన యేసయ్య రక్తము (2X) |
బహు దుఃఖములో మునిగెనే - చమట రక్తముగా మారెనే (2X) |
...యేసు... |
2. |
మనః సాక్షిని శుద్ది చేయును - మన యేసయ్య రక్తము (2X) |
మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను (2X) |
...యేసు... |
3. |
మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము (2X) |
మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను (2X) |
...యేసు... |