« యేసు రాజుగా వచ్చు చున్నాడు
Yesu raajuga vachchu chunnaadu
share with whatsapp

పల్లవి:
యేసు రాజుగా వచ్చు చున్నాడు   
భూలోకమంతా తెలుసుకొంటారు    (2X)
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు    (2X)
రారాజుగా వచ్చు చున్నాడు    (2X)
...యేసు...
1.
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు   
పరిశుధ్ధులందరిని తీసుకుపోతాడు    (2X)
లోకమంతా శ్రమకాలం    (2X)
విడువబడుట బహుఘోరం    (2X)
...యేసు...
2.
ఏడేండ్లు పరిశుధ్డులకు విందవబోతుంది   
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది    (2X)
ఈ సువార్త మూయబడున్    (2X)
వాక్యమే కరువగును    (2X)
...యేసు...
3.
వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును   
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును    (2X)
నీతి శాంతి వర్ధిల్లును    (2X)
న్యాయమే కనబడును    (2X)
...యేసు...
4.
ఈ లోక దేవతలన్ని ఆయన ముందర   
సాగిలపడి నమస్కరిమచి గడగడలాడును    (2X)
వంగని మోకాళ్ళన్ని    (2X)
యేసయ్య యెదుట వంగిపోవును    (2X)
...యేసు...
5.
క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడ   
కనిపెట్టి ప్రార్ధనచేసి సిధ్ధముగానుండు    (2X)
రెప్ప పాటున మారాలి    (2X)
యేసయ్య చెంతకు చేరాలి    (2X)
...యేసు...