పల్లవి: |
యేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదు |
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము |
మనుషులు నను మరచినా – నా వారే విడిచినా |
...యేసు... |
1. |
నింగి నేల మారినా – స్థితి గతులు మారినా (2X) |
ఎన్నడెన్నడు మారనిది యేసు నీ ప్రేమ |
ఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమ |
కంటి పాపవలె కాయు నీవుండగా |
...యేసు... |
2. |
దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన (2X) |
ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమ |
రక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమ |
నిత్య జీవమొసగె నీవుండగా |
...యేసు... |