పల్లవి: |
యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా |దేవ| (2X) |
మా – దోషములను హరించి మోక్షని |
వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన |
...యేసు... |
1. |
వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి |దేవ| (2X) |
యెంతో – కీడు జేసిన పాడు వైరిని |
గోడుగోడ నంగ వాని – తాడనము జేసితివి |
...యేసు... |
2. |
పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా |దేవ| (2X) |
నీ – దాపు జేరిన వారి కందరి |
కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు |
...యేసు... |
3. |
అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే |దేవ| (2X) |
మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు |
రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు |
...యేసు... |
4. |
అందమగు నీ మందిరమున – బొందుగా మేము |దేవ| (2X) |
నీ – సుందర కరుణామృతము మా |
డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన |
...యేసు... |