పల్లవి: |
యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి |
నా జీవితకాలమెల్ల - ప్రియ ప్రభువే నా పరిహారి |
1. |
ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించె బాధలెన్నో |
ఎన్ని నష్టాలు శోభిల్లిన - ప్రియ ప్రభువే నా పరిహారి |
...యేసే... |
2. |
నన్ను సాతాను వెంబడించిన - నన్ను శత్రువు ఎదిరించిన |
పలు నిందలు నను చుట్టిన - ప్రియ ప్రభువే నా పరిహారి |
...యేసే... |
3. |
మణి మాణ్యాలు లేకున్న - మనోవేదనలు వేధించిన |
నరులెల్లరు నను విడచిన - ప్రియ ప్రభువే నా పరిహారి |
...యేసే... |
4. |
బహు వ్యాదులు నను సోకిన - నాకు శాంతి కరువైన |
నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి |
...యేసే... |
5. |
దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు |
నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను |
...యేసే... |