పల్లవి: |
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2X) |
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2X) |
...యేసయ్యా... |
1. |
నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే (2X) |
నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే (2X) |
యుగయుగాల తలపు మది నిండెనే |
...యేసయ్యా... |
2. |
నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే (2X) |
నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2X) |
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే |
...యేసయ్యా... |
3. |
నీవు వరునిగా విచ్చేయి వేళ నా తలపుల పంట పండునే (2X) |
వధువునై నేను నిను చేరగా యుగయుగాలు నన్నేలు కొందువనే (2X) |
యుగయుగాలు నన్నేలు కొందువనే |
...యేసయ్యా... |