పల్లవి: |
ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను |
...ఎంత... |
1. |
హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను (2X) |
అవిశ్వాసినైన నన్ను (2X) |
ఆదరించినావుగా |
...ఎంత... |
2. |
రక్షకుండ నాకు బదులు శిక్ష ననుభవించినావు (2X) |
సిలువయందు సొమ్మసిల్లి (2X) |
చావొందితివి నాకై |
...ఎంత... |
3. |
ఏమి నీ కర్పించగలను ఏమి లేమి వాడనయ్యా (2X) |
రక్షణంపు పాత్రనెత్తి (2X) |
స్తొత్రమంచు పాడెద |
...ఎంత... |
4. |
నీదు నామమునకు యిలలో భయపడెడు వారి కొరకై (2X) |
నాథుడా నీ విచ్చు మేలు (2X) |
ఎంత గొప్పదేసువా |
...ఎంత... |
5. |
నేను బ్రతుకు దినములన్ని క్షేమమెల్ల వేళలందు (2X) |
నిశ్చయముగ నీవు నాకు (2X) |
ఇచ్చువాడా ప్రభువా |
...ఎంత... |
6. |
నాదు ప్రాణమునకు ప్రభువా సేద దీర్చు వాడ వీవు (2X) |
నాదు కాపరివి నీవు (2X) |
నాకు లేమి లేదుగా |
...ఎంత... |
7. |
అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా (2X) |
హల్లెలూయ స్తోత్రములను (2X) |
హర్షముతో పాడెద |
...ఎంత... |