పల్లవి: |
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా |
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా |
...ఏ పాప... |
1. |
ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా |
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా |
...ఏ పాప... |
2. |
కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా |
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా |
...ఏ పాప... |
3. |
చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా |
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా |
...ఏ పాప... |
4. |
ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా |
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా |
...ఏ పాప... |
5. |
పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా |
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా |
...ఏ పాప... |
6. |
బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా |
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము |
...ఏ పాప... |
7. |
కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా |
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి |
...ఏ పాప... |