పల్లవి: |
విశ్వాస వనితలము - ప్రభు యేసు ముద్రికలం |
ప్రకటించెదం, ప్రార్ధించెదం, స్తుతియించెదం - ప్రభుకై నిలిచెదము |
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2X) |
...విశ్వాస... |
1. |
సాటియైన సహాయముగా - మము సృస్టించాడు |
మేటియైన ప్రభు కార్యముకై - మము నిలిపాడు |
చురుకుదనం మా ప్రత్యేకత - ఆతిద్యమే మా నైజం |
అమ్మగా, ఆలిగా, బలశాలిగా - మము దీవించాడు |
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2X) |
...విశ్వాస... |
2. |
ప్రభుయేసు పునఃరుర్థానం - ప్రకటించింది మేమే |
అత్తరు తైలముతో - అభిశేకించింది మేమే |
ప్రేమ గుణం, త్యాగ గుణం, సుగుణ సుగంధం - మాలో నింపాడు |
జాలిగా, ప్రేమగా, మేలుగా - మము దీవించాడు |
హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2X) |
...విశ్వాస... |