« విజయా గీతముల్ పాడరే క్రీస్తుకు
Vijaya geethamul paadare
share with whatsapp

పల్లవి:
విజయా గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే    
వృజిన మంతటి మీఁద విజయ మిచ్చెడు దేవ నిజకుమారుని నామమున్   
హృదయములతో-భజన జేయుచు నిత్యమున్   
...విజయా...
1.
మంగళముగ యేసుఁడే మనకు రక్షణ-శృంగమై మరి నిల్చెను   
నింగిన్ విడచి వచ్చెను- శత్రుని యుద్డ రంగమందున గెల్చెను   
రంగు మీరఁగ దన-రక్తబలము వలన-పొంగునణగ జేసెను   
సాతానుని బల్ - కృంగ నలిపి చీల్చెను    
...విజయా...
2.
పాపముల్ దొలఁగింపను మనలను దన స్వ-రూపంబునకు మార్పను    
శాపం బంతయు నోర్చెను- దేవుని న్యాయ-కోపంబున్ భరియించెను    
పాపమెరుఁగని యేసు-పాపమై మన కొరకు-పాప యాగము దీర్చెను   
దేవుని నీతిన్ - ధీరుఁడై నెరవేర్చెను    
...విజయా...
3.
సిలువా మరణము నొందియు మనలను దనకై-గెలువన్ లేచిన వానికి    
చెలువుగన్ విమలాత్ముని-ప్రేమను మనలో-నిలువన్ జేసిన వానికిఁ    
కొలువుఁజేతుమెగాని -ఇలను మరవక వాణి -సిలువ మోయుచు నీ కృపా   
రక్షణ -చాల విలువ గలదని చాటుచు   
...విజయా...