పల్లవి: |
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో (2X) |
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా - వందనంబు లందుకో ప్రభో |
1. |
ఇన్నినాళ్ళు ధరని మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి యెపుడు |
గాచియు - నెన్నలేని దీవెన లిడు నన్న యేసువా - యెన్నిరెట్లు స్తోత్రము లివిగో |
...వందనం... |
2. |
పాత వత్సరంపు బాపమంతయు - బ్రీతిని మన్నించి మమ్ము గావుము |
నూత నాబ్దమునకు నీదు నీతి నొసగుమా - దాతా క్రీస్తు నాధ రక్షకా |
...వందనం... |
3. |
దేవ మాదు కాలుచేతులెల్లను - సేవకాళి తనువు దినములన్నియు నీవొసంగు |
వెండి పసిడి - జ్ఞాన మంతయు నీ సేవకై యంగీకరించుమా |
...వందనం... |
4. |
కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు తీర్చుము |
పాతకంబులెల్ల మాపి - భీతి బాపుము - ఖ్యాతి నొందు నీతి సూర్యుడా |
...వందనం... |
5. |
మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి నీయుము |
మోసపుచ్చు నంధకార - మంత ద్రోయుము - యేసు కృపన్ గుమ్మరించుము |
...వందనం... |