పల్లవి: |
స్వఛ్చంద సీయోను వాసి సర్వాధికారి – కస్తూరి పూరాసి (2X) |
వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2X) |
అల్ఫా ఒమేగ తానే (2X) |
ఆద్యంతము మన యేసే (2X) |
...స్వఛ్చంద... |
1. |
ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2X) |
పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2X) |
లెక్క లేని యద్భుతముల్ (2X) |
మక్కువతో చేయువాడు (2X) |
...స్వఛ్చంద... |
2. |
సంగీతం నాదముల తోడ సీయోను పురము – సొంపుగను చేరితిమి (2X) |
శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2X) |
దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2X) |
మిక్కిలి ఆనందము కల్గెన్ (2X) |
...స్వఛ్చంద... |
3. |
నీలముల పునాదులు వేసి నీలాంజనములతో – మాణిక్య మణులతో (2X) |
సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో (2X) |
ప్రశస్త రత్నములతో (2X) |
ప్రవిమలముగా నిను గట్టెదను (2X) |
...స్వఛ్చంద... |
4. |
సుమముల హారము సంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే (2X) |
ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే (2X) |
హిత వత్సరము విముక్తి (2X) |
ఆత్మాభిషేకము నీదే (2X) |
...స్వఛ్చంద... |
5. |
జలములలో బడి దాటునప్పుడు బలమై యుండెదను – నీ తోడై యుండెదను (2X) |
నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు (2X) |
అగ్ని మధ్యను నడచినను (2X) |
జ్వాలలు నిను కాల్చగ లేవు (2X) |
...స్వఛ్చంద... |
6. |
ఇత్తడి తలుపుల బగుల గొట్టెద నినుప ఘడియలను – విడగొట్టెదను నేను (2X) |
అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను (2X) |
రహస్యములో మరుగైన (2X) |
ధనమును నీ కొసంగెదను (2X) |
...స్వఛ్చంద... |
7. |
గర్భమున పుట్టినది మొదలు తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు (2X) |
నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా (2X) |
ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2X) |
ఎత్తుకొను వాడను నేనే (2X) |
...స్వఛ్చంద... |