« స్తుతించెదను..స్తుతించెదనూ..
Sthuthinchedhanu sthuthinchedhanu
share with whatsapp

పల్లవి:
స్తుతించెదను..స్తుతించెదనూ..   
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము - స్తుతించెదను    (2X)
1.
ఉన్నత దేవుడు సర్వాధిపతియు - ఉర్విపరిపాలక   
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన - ఉత్తమ స్నేహితుని   
ఉదయం సంధ్యా - ఎల్లప్పుడును - ఉత్సాహధ్వనితో పాడెదను    (2X)
...స్తుతించెదను...
2.
నాశనకరమైన పాప గుంటనుండి నరక వేదననుండి   
నన్ను విడిపించి నిలిపిన దేవా - నిర్మలా స్వరూప   
నీతి సమాధానం సంతోషముతో - నిత్యజీవము నాకీచ్చితివి    (2X)
...స్తుతించెదను...
3.
పాపము క్షమించి రోగము - బాపి భయమును దీర్చి   
పవిత్రదాయక పావనమూర్తి - పరిశుద్ధ మిచ్చిన   
పరమ పాదం శరణ్యం నాకు - పరమరాజా పుణ్యదేవా    (2X)
...స్తుతించెదను...
4.
తల్లిగర్భమునకు ముందేర్పరచి -దేహము నమర్చియు   
దక్షిణ బాహుతొ పట్టుకొనిన - దయా సంపూర్ణుడా   
దిక్కు జయము ఆదరణయు -దయతో అనుగ్రహించితివి    (2X)
...స్తుతించెదను...
5.
సిలువనెత్తి శ్రమలు సహించ - సేవకు పిలచిన   
స్నేహ దర్శక వీర యోధ - సంశయ హరక   
శ్రమలు నింద ఆకలియైన - నీ స్నేహము నుండి ఎడబాపునా    (2X)
...స్తుతించెదను...