పల్లవి: |
స్తుతి యాగము నా యేసుకే - అర్పించెదను - ఎల్లప్పుడు |
1. |
నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి - ప్రతి నిముషము నా మార్గములొ |
నన్ను నడిపిన కృపను తలంచి - స్తుతులర్పించెదను - నీకె |
...స్తుతి... |
2. |
ఓదార్పు లేనట్టి చీకటి వేళలో - ఆదరణ కర్తవు నాకు నీవు |
మారా అనుభవం మార్చి ఇలలొ - సంతసమిచ్చితివి - నిత్య |
...స్తుతి... |
3. |
రక్షక నీవే నా శైలము బలమును - యుద్ధ దినములో నాకేడము |
సాతాను అస్త్రములు ఆర్పివేసి - జయము నొసగితివి - గోప్ప |
...స్తుతి... |
4. |
దేవుని సెలవు లేనిది ఏదయు - జరుగదుగా అని గ్రహించితిని |
నా జీవితములో ప్రతి దినమును - మేలుకొరకే గదా కల్గెను |
...స్తుతి... |
5. |
ఆర్భటించు సీయోన్ హర్షించు - షాలేమా నీ యేసు నీతోనె యుండెనుగా |
ఆయన మనకు ఆదియు అంతము - పాడెద హల్లెలూయ ఆమేన్ |
...స్తుతి... |