పల్లవి: |
స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము |
యేసు నాధుని మేలులు తలంచి |
...స్తోత్రం... |
1. |
దీవారాత్రము - కంటిపాపవలె కాచి (2X) |
దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి |
...స్తోత్రం... |
2. |
గాఢాంధకారములో - కన్నీటి లోయలలో (2X) |
కృషించి పోనీయక - కృపలతొ బలపరచితివి |
...స్తోత్రం... |
3. |
సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి (2X) |
సంపూర్ణ సిద్ధినొంద - శుద్ధాత్మను నొసగితివి |
...స్తోత్రం... |
4. |
సీయోను మార్గములొ - పలు శోధనలు రాగా (2X) |
సాతాన్ని జయించుటకు - విశ్వాసము నిచ్చితివి |
...స్తోత్రం... |
5. |
సిలువని మోసుకొని - సువార్తను చేపట్టి (2X) |
యేసుని వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి |
...స్తోత్రం... |
6. |
పాడెద హల్లెలూయ - 'మరనాత' హల్లెలూయ (2X) |
సదా పాడెద హల్లెలూయ - ప్రభు యేసుకె హల్లెలూయా |
...స్తోత్రం... |