పల్లవి: |
సిలువ చెంత చేరిననాడు - కలుషములను కడిగివేయు |
పౌలు వలెను సీల వలెను - సిద్ధపడిన భక్తుల జూచి |
...సిలువ... |
1. |
కొండవంటి బండవంటి - మొండి హృదయంబు మండించు |
పండియున్న పాపులనైన - పిలుచుచుండె పరము చేర |
...సిలువ... |
2. |
వంద గొఱ్ఱెల మంద నుండి - ఒకటి తప్పి ఒంటరియాయె |
తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి - ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్ |
...సిలువ... |
3. |
తప్పిపొయిన కుమారుండు - తండ్రిని విడచి తరలిపొయె |
తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రి యతని చేర్చుకొనెను |
...సిలువ... |
4. |
పాపి రావా పాపము విడచి - పరిశుద్ధుల విందులొ చేర |
పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము |
...సిలువ... |