« సిలువ చెంత చేరిననాడు - కలుషములను కడిగివేయు

పల్లవి:
సిలువ చెంత చేరిననాడు - కలుషములను కడిగివేయు    
పౌలు వలెను సీల వలెను - సిద్ధపడిన భక్తుల జూచి    
...సిలువ...
1.
కొండవంటి బండవంటి - మొండి హృదయంబు మండించు    
పండియున్న పాపులనైన - పిలుచుచుండె పరము చేర    
...సిలువ...
2.
వంద గొఱ్ఱెల మంద నుండి - ఒకటి తప్పి ఒంటరియాయె    
తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి - ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్    
...సిలువ...
3.
తప్పిపొయిన కుమారుండు - తండ్రిని విడచి తరలిపొయె    
తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రి యతని చేర్చుకొనెను    
...సిలువ...
4.
పాపి రావా పాపము విడచి - పరిశుద్ధు విందులొ చేర    
పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము    
...సిలువ...