పల్లవి: |
శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2X) |
నేడు పాయక బెత్లె హేము ఊరిలో (2X) |
...శ్రీ యేసుండు... |
1. |
ఆ కన్నీయ మరియమ్మ గర్భమందున (2X) |
ఇమ్మానుయేలనేడి నామమందున (2X) |
...శ్రీ యేసుండు... |
2. |
సత్రమందున పశువులశాల యందున (2X) |
దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2X) |
...శ్రీ యేసుండు... |
3. |
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2X) |
పశుల తొట్టిలొ పరుండ బెట్టబడి (2X) |
...శ్రీ యేసుండు... |
4. |
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2X) |
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2X) |
...శ్రీ యేసుండు... |
5. |
మన కొరకొక్క శిశువు పుట్టేను (2X) |
ధరను మన దోషముల బోగొట్టేను (2X) |
...శ్రీ యేసుండు... |
6. |
పరలోకపు సైన్యంబు గూడేను (2X) |
మింట వర రక్షకుని గూర్చి పాడెను (2X) |
...శ్రీ యేసుండు... |
7. |
అక్షయుండగు యేసు పుట్టేను (2X) |
మనకు రక్షణంబు సిద్ధపరచెను (2X) |
...శ్రీ యేసుండు... |