పల్లవి: |
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు |
రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని |
...రుచి చూచి... |
1. |
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవె |
తప్పక ఆరాదింతు దయాళుడవు నీవే |
...రుచి చూచి... |
2. |
మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా |
మనసార పొగడెదను నీ ఆశ్చర్యకార్యములన్ |
...రుచి చూచి... |
3. |
మంచి తనము గల దేవా ప్రభావము గలవాడా |
ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు |
...రుచి చూచి... |
4. |
ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలొ చేరి |
సంపూర్ణముగా పొందెదను అడుగువాటన్నిటికి |
...రుచి చూచి... |