« రండి యుత్చాహించి పాడుదము
Randi yuchahinchi paadudhamu
share with whatsapp

పల్లవి:
రండి యుత్చాహించి పాడుదము - రక్షణదుర్గము మన ప్రభువే   
1.
రండి కృతజ్ఞత స్తోత్రముతో- రారాజు సన్నిధి కేగుదము   
సత్ప్రభునామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము   
...రండి...
2.
మన ప్రభువే మహదేవుండు - ఘన మహత్మ్యము గల రాజు   
భూమ్యాగాధపు లోయలును - భూతల శిఖరములాయనవే   
...రండి...
3.
సముద్రము సృష్టించె నాయననే - సత్యుని హస్తమే భువిఁ జేసెన్   
ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొఱ్ఱెలము   
...రండి...
4.
ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము   
ఆయన మాటలు గైకొనిన - నయ్యవి మీకెంత మేలగును   
...రండి...
5.
తండ్రికుమార శుద్ధాత్మకును - దగుస్తుతి మహిమలు కల్గుగాక   
ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌను ఆమేన్   
...రండి...