పల్లవి: |
రమ్మనుచున్నాడు - నిన్ను ప్రభు యేసు |
వాంచతో తన కరము చాపి - రమ్మనుచున్నాడు (2X) |
1. |
ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీకిచ్చునని |
గ్రహించి నీవు యేసుని చూచిన - హద్దు లేని ఇంపు నొందేదవు |
...రమ్మనుచు... |
2. |
కన్నీరంతా తుడుచును - కనుపాప వలె గాపాడున్ - కారు మేఘము |
వలె కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడును |
...రమ్మనుచు... |
3. |
సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును - ఆయన నీ వెలుగు |
రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము |
...రమ్మనుచు... |
4. |
సకల వ్యాధులను - స్వస్థపరచుటకు - శక్తిమంతుడగు |
ప్రభుయేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్ |
...రమ్మనుచు... |