« రక్షకుండుదయించి నాడట
Rakshakundudhayinchi nadata
share with whatsapp

పల్లవి:
రక్షకుండుదయించి నాడట - మన కొరకు - బరమ రక్షకుండుదయించి    
నాడట -రక్షకుండుదయించి నాడు - రారె - గొల్లబోయలార   
తక్షణమున - బోయి మన నిరీక్షణ ఫలమొందెదము   
...రక్షకుండు...
1.
దావీదు వంశమందు ధన్యుఁడు జన్మించినాడు    (2X)
దేవుడగు యెహోవా మన - దిక్కు దేరి చూచినాడు   
...రక్షకుండు...
2.
గగనమునుండి దిగ్గి - ఘనుడు గబ్రియేలు దూత     (2X)
తగినట్టు చెప్పె వారికి - మిగుల సంతోషవార్త   
...రక్షకుండు...
3.
వర్తమానము జెప్పి దూత - వైభవమున బోవుచున్నాడు కర్తను    (2X)
జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు   
...రక్షకుండు...
4.
పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్త్రముల జుట్టి     (2X)
గనుగొందురని - శీఘ్రముగను దూత తెల్పె   
...రక్షకుండు...
5.
అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు - అనుమతించి    
కడకు క్రీస్తు నందరికినీ దెల్పినారు   
...రక్షకుండు...