పల్లవి: |
రాకడ సమయంలో - కడబూర శబ్ధంతో |
యేసుని చేరుకునే - విశ్వాసం నీకుందా? |
రావయ్య యేసయ్య - వేగరావయ్యా |
రావయ్య యేసునాధా - వేగమెరావయ్యా |
1. |
యేసయ్య రాకడ సమయంలో - ఎదురేగె రక్షణ నీకుందా? |
లోకాశలపై విజయం నీకుందా? |
...రాకడ... |
2. |
ఇంపైన ధూపవేదికగా - ఏకాంత ప్రార్థన నీకుందా? |
యేసు ఆశించే దీనమనసు నీకుందా? |
...రాకడ... |
3. |
దినమంతా దేవుని సన్నధిలో - వాక్యం కొరకు ఆకలి |
నీకుందా? - యేసునాధునితో సహవాసం నీకుందా? |
...రాకడ... |
4. |
శ్రమలోన సహనం నీకుందా? స్తుతియించె నాలుక |
నీకుందా? ఆత్మలకొరకైన భారం నీకుందా? |
...రాకడ... |
5. |
నీ పాతరోత జీవితము - నీ పాప హృదయం మారిందా? |
నూతన హృదయంతో -ఆరాధన నీకుందా? |
...రాకడ... |
6. |
అన్నీటికన్నా మిన్నగను - కన్నీటి ప్రార్ధన నీకుందా? |
ఎల్లవేళలలో - స్తుతియాగం నీకుందా? |
...రాకడ... |