పల్లవి: |
ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం |
ముదమార వసియించునా హృదయాంతరంగమున |
1. |
నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును (2X) |
పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి (2X) |
... ప్రియ యేసు... |
2. |
అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి (2X) |
కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి (2X) |
... ప్రియ యేసు... |
3. |
వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనే (2X) |
చేరితి నీదు దారి కోరి నడిపించుము (2X) |
... ప్రియ యేసు... |
4. |
ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు (2X) |
ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయ రూపుండా (2X) |
... ప్రియ యేసు... |