« ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా (Ab)

పల్లవి:
ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా    
1.
శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి     (2X)
పరముడ నిను ప్రణుతించెద ప్రియముగ - ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా    
...ప్రార్ధన...
2.
పరమ దేవుడవని తెలిసి - కరములెత్తి జంటగా మోడ్చి     (2X)
శిరమును వంచి - సరిగను వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా    
...ప్రార్ధన...
3.
దినములోన చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ     (2X)
దీనుడవయ్యు - ఒంటిగ కొండను చేసిన ప్రార్ధన నేర్పుమయా    
...ప్రార్ధన...
4.
శ్రమలు యేసుని చుట్టుకొని - శత్రుమూక నిను బట్టగను     (2X)
శాంతముతో - శరణనివేడిన - గెత్సెమనె ప్రార్థన నేర్పుమయా    
...ప్రార్ధన...