పల్లవి: |
ప్రభువా నీలో జీవించుట - కృపా బాహుళ్యమే - నా యెడ కృపాబాహుళ్యమే |
1. |
సంగీతములాయే పెను తుఫానులన్నియూ - సమసిపోవునే నీ |
నామస్మరణలో - సంతసమొందే - నా మది యెంతో |
...ప్రభువా... |
2. |
పాప నియమము - బహు దూరముగా చేసి |
పావన ఆత్మతో - పరిపూర్ణమై - పాదపద్మము - హత్తుకొనెదను |
...ప్రభువా... |
3. |
నీలో దాగినది - కృప సర్వోన్నతముగా - నీలో నిలిచి |
కృపననుభవించి - నీతోనే యుగయుగములు నిల్చెద |
...ప్రభువా... |
4. |
నూతన వదువునై - శుద్ధ వస్త్రములు ధరించి - నూతనమైన |
శభాకాంక్షలతో - నూతన షాలేమై - సిద్ధమౌదు నీకై |
...ప్రభువా... |