« ప్రభువా నీలో జీవించుట - కృపా బాహుళ్యమే
Prabhuva neelo jeevinchuta
(Ab) share with whatsapp

పల్లవి:
ప్రభువా నీలో జీవించుట - కృపా బాహుళ్యమే - నా యెడ కృపాబాహుళ్యమే   
1.
సంగీతములాయే పెను తుఫానులన్నియూ - సమసిపోవునే నీ   
నామస్మరణలో - సంతసమొందే - నా మది యెంతో   
...ప్రభువా...
2.
పాప నియమము - బహు దూరముగా చేసి   
పావన ఆత్మతో - పరిపూర్ణమై - పాదపద్మము - హత్తుకొనెదను   
...ప్రభువా...
3.
నీలో దాగినది - కృప సర్వోన్నతముగా - నీలో నిలిచి   
కృపననుభవించి - నీతోనే యుగయుగములు నిల్చెద   
...ప్రభువా...
4.
నూతన వదువునై - శుద్ధ వస్త్రములు ధరించి - నూతనమైన   
శభాకాంక్షలతో - నూతన షాలేమై - సిద్ధమౌదు నీకై   
...ప్రభువా...