పల్లవి: |
పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు (2X) |
నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు (2X) |
...పరిశుద్ధాత్ముడా... |
1. |
మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో (2X) |
ఆదిలో జరిగిన విదములుగ మిక్కిలి శక్తినిమ్ము (2X) |
...పరిశుద్ధాత్ముడా... |
2. |
వరదానములు రగులుకొని మేము వాక్యంలో వేరుండి ఎదుగుటకై (2X) |
కడవరి వర్షం మా మీద కృమ్మరించుము దేవా (2X) |
...పరిశుద్ధాత్ముడా... |
3. |
లోకాశలతో పోరాడి- మేము సాతాను శక్తిపై జయము పొంది (2X) |
దీనడనై నీ సేవ చేయుటకు అభిశేఖం చేయుమయా (2X) |
...పరిశుద్ధాత్ముడా... |