పల్లవి: |
పరమా జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతోనుండ |
నిరంతరము నను నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును |
యేసు చాలును - యేసు చాలును - ఏ సమయమైనా |
ఏ స్తితికైనా - నా జీవితములొ - యేసు చా లు ను |
1. |
సాతాను శోధన లదికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను (2X) |
లోకము శరీరము లాగిననూ - లోబడక నేను వెళ్ళెదను (2X) |
...యేసు చాలును... |
2. |
పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలముల చెంత నడిపించును (2X) |
అనిశము ప్రాణము తృప్తిపరచును - మరణ లోయలొ నన్ను కాపాడును (2X) |
...యేసు చాలును... |
3. |
నరులెల్లరు నను విడచినను - శరీరము కృళ్ళి కృశించినను (2X) |
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నను విడచినను (2X) |
...యేసు చాలును... |