« ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను
Oh thalli kannanu oh thandri kannanu
share with whatsapp

పల్లవి:
ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను   
ప్రేమించు దేవుడు క్షమియించు దేవుడు     (2X)
ప్రేయసికన్న ప్రేమించు దేవుడు    (2X)
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు    (2X)
...ఓ తల్లి ...
1.
కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరి చూపిన క్రీస్తేసు ప్రేమ    (2X)
ముదిమి వచ్చు వరకు నిను ఎత్తుకునే ప్రేమ    (2X)
తల్లియైన మరచినా నిను మరువని ప్రేమ     (2X)
ప్రేమా.. ప్రేమా.. ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ   
ప్రేమా.. ప్రేమా.. ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ   
...ఓ తల్లి...
2.
పర్వతాలు తోలగిన తొలగిపోని ప్రేమ-   
పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ    (2X)
ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ    (2X)
పరలోకమునకు నిన్ను జేర్చు ప్రేమ    (2X)
ప్రేమా.. ప్రేమా.. ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ   
ప్రేమా.. ప్రేమా.. ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ   
...ఓ తల్లి...