పల్లవి: |
నీతో నుండని బ్రతుకు నిను చూడని క్షణము |
ఊహించలేను నా యేసయ్యా ఓ.. |
నిను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు |
ఊహించలేను నా యేసయ్యా ఓ.. |
నీదు స్వరము వినకనే నేను నిను విడచి తిరిగితి నేను |
నాదు బ్రతుకులో సమస్తము కోలిపోయితి (2X) |
...నిను చూడని... |
1. |
నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడు త్రోసివేసి |
అంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితిని (2X) |
అయినా అదే ప్రేమ నను చేర్చుకున్న ప్రేమ |
నను వీడని కరుణ మరువలేనయ్యా.. యేసయ్యా |
...నీతో నుండని... |
2. |
నన్ను హత్తుకొన్న ప్రేమ నన్ను చేర్చుకున్న ప్రేమ |
నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్ (2X) |
నను విడువకు ప్రియుడా నాకు తోడుగా నడువు |
నీ తోనే నా బ్రతుకు సాగింతును.. యేసయ్యా |
నిను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు |
ఊహించలేను నా యేసయ్యా.. (4X) |