« నేను వెళ్ళే మార్గము నా యేసుకే
Nenu vellu maargamu
share with whatsapp

పల్లవి:
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును    (2X)
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను    (2X)
...నేను వెళ్ళే...
1.
కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున    (2X)
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు    (2X)
...నేను వెళ్ళే...
2.
జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు    (2X)
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు     (2X)
...నేను వెళ్ళే...
3.
విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు    (2X)
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు    (2X)
...నేను వెళ్ళే...
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌    (3X)