పల్లవి: |
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను- |
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2X) |
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2X) |
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2X) |
...నేనేమైనా... |
1. |
లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2X) |
ఇచ్చిన నీవే బలి కోరగా (2X) |
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా (2X) |
...నేనేమైనా... |
2. |
సర్వము పోయి శరీరం కుళ్ళిన నా అనువారే వెలివేసినా (2X) |
ఆప్తులంతా శత్రువులైనా (2X) |
అంతము వరకు సహియించిన ఆ యోబులా (2X) |
...నేనేమైనా... |
3. |
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలే (2X) |
ఇదిగో నేను ఉన్నానయ్యా (2X) |
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా (2X) |
...నేనేమైనా... |