« నీవు లేని రోజంతా రోజౌనా
Neevu leni rojantha
share with whatsapp

పల్లవి:
నీవు లేని రోజంతా రోజౌనా    
నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా    
నీవు లేని రోజంతా రోజౌన   
...నీవు...
1.
జీవజల ఊటయు ప్రభు నీవే    
సత్యము మార్గము ప్రభు నీవే   
నా తోడబుట్టువు ప్రభు నీవే    
నాలోని సంతసం ప్రభు నీవే   
2.
వెలుగందు జ్వాలయు ప్రభు నీవే    
ధ్వనియు శబ్దము ప్రభు నీవే   
తాళము రాగము ప్రభు నీవే    
మ్రోగెడి కంచుయు ప్రభు నీవే   
3.
నా క్రియలన్నియూ ప్రభు నీవే    
నాదు బలమంతయూ ప్రభు నీవే   
నా కోట బాటయు ప్రభు నీవే    
నా డాలు కేడెము ప్రభు నీవే   
4.
నా తలపులన్నియు ప్రభు నీవే    
నా భాష మాటయు ప్రభు నీవే   
నాదు విమోచన ప్రభు నీవె    
నా పునరుత్థానము ప్రభు నీవె