పల్లవి: |
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు |
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది (2X) |
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా |
నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా (2X) |
...నీటి... |
1. |
పనికిరాని నను నీవు పైకి లేపితివి |
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి (2X) |
నా అడుగులు స్థిర పరచి బలము నిచ్చితివి |
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు |
నే వెంబడింతు ప్రభూ |
...నా ప్రాణమా... |
2. |
అంధకారపు లోయలలో నేను నడచినను |
ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి (2X) |
కంటిపాపగ నీవని నిన్నుకొలిచితిమి |
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను |
ఇలలో నిన్ను కొలిచెదను |
...నా ప్రాణమా... |