పల్లవి: |
నీ రక్తమే నీ రక్తమే నన్ - శుద్ధీకరించున్ - నీ రక్తమే నా బలము |
నీ రక్తధారలేయిల - పాపికాశ్రయంబిచ్చును |
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పావన పరచుము |
1. |
నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది |
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది |
...నీ రక్తమే ... |
2. |
నీ సిలువలో కార్చినట్టి - విలువైన రక్తములోన |
పరమ పావన కడుగుము - పవిత్ర పరచుము పాపిని |
...నీ రక్తమే ... |
3. |
పందివలె పొర్లిన నన్ను - కుక్క వలె తిరిగిన నన్ను |
ప్రేమతొ చేర్చుకొంటివి - ప్రేమార్హ నీకె స్తోత్రము |
...నీ రక్తమే ... |
4. |
నన్ వెంబడించు సాతాన్ - నన్ బెదరించు సాతానున్ |
దును మాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే |
...నీ రక్తమే ... |
5. |
స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకు |
స్తుతి పాత్ర నీకె చెల్లును - స్తోత్రార్హ నీకె తగును |
...నీ రక్తమే ... |