« నీ ధనము నీ ఘనము ప్రభు
Nee dhanamu nee ghanamu
share with whatsapp

పల్లవి:
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే   
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా   
...నీ ధనము...
1.
ధరలోన ధన ధాన్యముల నీయగా   
కరుణించి కాపాడి రక్షింపగా    (2X)
పరలోక నాధుండు నీకీయగా   
మరి యేసు కొరకీయ వెనుదీతువా   
...నీ ధనము...
2.
పాడిపంటలు ప్రభువు నీకీయగా    
కూడు గుడ్డలు నీకు దయచేయగా    (2X)
వేడంగ ప్రభు యేసు నామంబును    
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా   
...నీ ధనము...
3.
వెలుగు నీడలు గాలి వర్షంబులు    
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా    (2X)
వెలిగించ ధర పైని ప్రభు నామము    
కలిమి కొలది ప్రభున కర్పింపవా   
...నీ ధనము...
4.
కలిగించె సకలంబు సమృద్దిగా    
తొలగించె పలుభాధ భరితంబులు    (2X)
బలియాయె నీ పాపముల కేసువే   
చెలువంగ ప్రభుకీయ చింతింతువా   
...నీ ధనము...