పల్లవి: |
నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని |
నే వెనుదిరుగన్ నే వెనుకాడన్ నేడేసుడు పిల్చి న సుదినం (2X) |
...నే యేసుని... |
1. |
నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ నాదే దారి |
నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు (2X) |
నా యేసుని మించి నా మిత్రుల్ నాకిలలో గానిపించరని |
...నే యేసుని... |
2. |
కరువులైనను కలతలైనను కలసిరాని |
కలిమి లేములు కలవరంబులు కలిగిన నూ (2X) |
కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము |
...నే యేసుని... |
3. |
శ్రమ యైననూ బాధ లైననూ హింసయైన |
వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన (2X) |
నా యేసుని ప్రేమనుండి నను యెడబాపేటి వారెవరు |
...నే యేసుని... |