« నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంత
Ne saagedha yesunitho
share with whatsapp

పల్లవి:
నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంత   
1.
యేసుతొ గడిపెద - యేసుతొ నడిచెద - పరమున చేరగ - నే వెళ్ళెదా    (2X)
హానోకు వలె సాగెదా.. ఆ...   
...నే సాగెద...
2.
వెనుక శత్రువులు - వెంటాడినను - ముందు సముద్రము - ఎదురొచ్చినా    (2X)
మోషె వలె సాగెదా.. ఆ...   
...నే సాగెద...
3.
లోకపు శ్రమలు - నన్నెదిరించిన - కఠినులు రాళ్ళతొ హింసించినా    (2X)
స్తెఫను వలె సాగెదా.. ఆ...   
...నే సాగెద...
4.
తల్లి మరచిన - తండ్రి విడచిన - బంధువులే నన్ను - వెలివేసినా    (2X)
బలవంతునితో సాగెదా.. ఆ...   
...నే సాగెద...
5.
బ్రతుకుట క్రీస్తు చావైన మేలే - క్రీస్తుకై హత సాక్షిగా మారినా    (2X)
పౌలు వలె సాగెదా.. ఆ...   
...నే సాగెద...