« నావన్ని యంగీకరించుమీ దేవా
Navanni yangeekarinchumee dhevaa
share with whatsapp

పల్లవి:
నావన్ని యంగీకరించుమీ దేవా –    
నన్నెప్పుడు నీవు కరుణించుమీ   
నావన్ని కృపచేత నీవలన నొందిన    (2X)
భావంబునను నేను బహుదైర్యమొందెద   
...నావన్ని...
1.
నీకు నా ప్రాణము నిజముగా నర్పించి    (2X)
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద   
...నావన్ని...
2.
సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని    (2X)
నిత్యంబు గరముల నీ సేవ జేసెద   
...నావన్ని...
3.
నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు    (2X)
ఆశచే నడిపించు మరల నా పదములు   
...నావన్ని...
4.
పెదవులతో నేను బెంపుగ నీ వార్త    (2X)
గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి   
5.
నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ    (2X)
యావంత యైనను నాశింప మదిలోన   
...నావన్ని...
6.
నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే    (2X)
సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు   
...నావన్ని...
7.
చిత్తము నీ కృపా యత్తంబు గావించి    (2X)
మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము   
...నావన్ని...
8.
హృదయంబు నీకిత్తు సదనంబు గావించి    (2X)
పదిలంబుగా దాని బట్టి కాపాడుము   
...నావన్ని...