« నన్ను గన్నయ్య రావే నా యేసు
Nannu gannayya raave naa yesu
share with whatsapp

పల్లవి:
నన్ను గన్నయ్య రావే నా యేసు   
నన్ను గన్నయ్యా రావే నా ప్రభువా    (2X)
...నన్ను...
1.
ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను    (2X)
పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ    
...నన్ను...
2.
హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి    (2X)
మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి   
...నన్ను...
3.
కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను    (2X)
ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి   
...నన్ను...
4.
దారుణ సంసార వారధి దరి జూపి ప్రోవ నీ కన్నను    (2X)
కారణ గురువు లింకెవ్వరు లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి   
...నన్ను...
5.
నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని    (2X)
దీవించి రక్షింపనిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి   
...నన్ను...