పల్లవి: |
మణులు మాణిక్యములున్న - మేడమిద్దెలు ఎన్నున్నా |
మదిలొ యేసు లేకున్నా - ఏది వున్నా అది సున్నా |
1. |
చదువులెన్నో చదివున్నా - పదవులెన్నో చేస్తున్నా |
విద్య వున్నా బుద్ది వున్నా - జ్ఞానమున్నా అది సున్నా |
...మణులు... |
2. |
అందచందా లెన్నున్నా - అందలముపై కూర్చున్నా |
సుందరుడగు ప్రభు లేకున్నా - అందమున్నా అది సున్నా |
...మణులు... |
3. |
రాజ్యములు రమణులున్నా - శౌర్యములు గల వీరులున్నా |
బలము వున్నా బలగమున్నా - ఎన్నియున్నా అవి సున్నా |
...మణులు... |
4. |
పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్యకార్య సిద్దుడా |
దానధర్మము తపము జపము - యేసు లేనివి అన్నీ సున్నా |
...మణులు... |