పల్లవి: |
మంగళమే యేసునకు - మనుజావతారునకు(3x) |
శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే |
...మంగళమే... |
1. |
పరమపవిత్రునకు - వరదివ్యతేజునకు(3x) |
నిరుపామనందునకు (2x)- నిపుణవైద్యునకు - మంగళమే |
...మంగళమే... |
2. |
దురిత సంహారునకు - వరసుగుణోద్ధారునకు (3x) |
కరుణా సంపన్నునకు (2x) - జ్ఞాన దీప్తునకు మంగళమే |
...మంగళమే... |
3. |
రాజులపై పాజునకు - రవి కోటి తేజునకు (3x) |
బూజార్హ పదాబ్జునకు (2x) - భువనావన మీకు మంగళమే |
...మంగళమే... |
4. |
సత్యప్రవర్తనకు - సద్ధర్మశీలునకు (3x) |
నిత్య స్వయం జీవునకు (2x) - నిర్మలాత్మునకు మంగళమే |
...మంగళమే... |
5. |
యుక్త స్తోత్రార్హునకు - భక్త రక్షామణికి (3x) |
సత్య పరంజ్యోతియగు (2x) - సార్వభౌమునకు మంగళమే |
...మంగళమే... |
పరమ పురి వాసునకు - నర దైవ రూపునకు (3x) |
బరమేశ్వర తనయునకు (2x) - బ్రణుతింతుము నీకు మంగళమే |
...మంగళమే... |