పల్లవి: |
మనకై యేసు మరణించె – మన పాపముల కొరకే |
నిత్యజీవితము నిచ్చుటకే – సత్యుండు సజీవుడాయె (2X) |
...మనకై యేసు... |
1. |
తృణీకరింపబడె విసర్జింపబడెను (2X) |
దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను (2X) |
...మనకై యేసు... |
2. |
మన వ్యసనముల వహించెన్ – మన దుఃఖముల భరించెన్ (2X) |
మన మెన్నిక చేయకయే – మన ముఖముల ద్రిప్పితిమి (2X) |
...మనకై యేసు... |
3. |
మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకు (2X) |
మన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె (2X) |
...మనకై యేసు... |
4. |
గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్ (2X) |
అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును (2X) |
...మనకై యేసు... |
5. |
దౌర్జన్యము నొందెను – బాధింపబడెను (2X) |
తన నోరు తెరువలేదు – మనకై క్రయధనమీయన్ (2X) |
...మనకై యేసు... |
6. |
ఎదిరింప లేదెవరిన్ – లేదే కపటము నోట (2X) |
యెహోవా నలుగగొట్టెన్ – మహావ్యాధిని కలిగించెన్ (2X) |
...మనకై యేసు... |
7. |
సిలువలో వ్రేలాడెన్ – సమాధిలో నుండెను (2X) |
సజీవుండై లేచెన్ – స్తోత్రము హల్లెలూయ (2X) |
...మనకై యేసు... |