పల్లవి: |
మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను |
సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను |
బలవంతుడా నీ సన్నిధినే - నే ఆశ్రయించెదా అనుదినము |
యేసయ్యా.. యేసయ్యా... |
1. |
రాత్రివేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణముకైనా |
చీకటిలో సంచరించు తెగులుకైనా దినమెల్లా వేధించు వ్యాధికైనా |
నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే (2X) |
...యేసయ్యా... |
2. |
వేయిమంది నా ప్రక్క పడిపోయినా పదివేలు నా చుట్టు కాలినను |
అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించినా |
3. |
నే భయపడను నే దిగులు చెందను యెహోవా నిస్సి నా తోడు నీవే (2X) |
...యేసయ్యా... |
4. |
నిను ప్రేమించువారిని తప్పించువాడా నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా (2X) |
5. |
నా యుద్ధము జయించి లేవనెత్తువాడా కృప వెంబడి కృప చూపించువాడా (2X) |
...యేసయ్యా... |
6. |
నే భయపడను నే దిగులు చెందను యెహోవా షాలోం నా తోడు నీవే |